హీరోయిన్‌ బర్త్‌ డే.. సూర్యుడి శుభాకాంక్షలు!

సెలబ్రెటీల పుట్టిన రోజు అంటే అభిమానులు లేదా ప్రముఖులు వారి గురించి ప్రశంసిస్తూ సోషల్‌ మీడియాలో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతారు. లేకపోతే వారికి సంబంధించి కొత్త సినిమా లేక ఏదో ఒక కొత్త విషయాన్ని పుట్టిన రోజున అభిమానుల కోసం సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తుంటారు. అయితే వీటికి భిన్నంగా బాలీవుడ్‌ భామ ఊర్వశి రౌతేలా తన పుట్టిన రోజు పోస్టును షేర్‌ చేసి అభిమానుల చేత ఔరా అనిపించుకుంటున్నారు. మంగళవారం ఈ బ్యూటీ క్వీన్‌ పుట్టిన రోజు.  ఈ సందర్భంగా ఈ భామ తనకు తానే పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ సోమవారం రాత్రి ఇన్‌స్టాగ్రామ్‌లో తన తాజా చిత్రాన్ని షేర్‌ చేశారు.











‘నా కోసం ఈ రోజు సూర్యుడు కాస్తా అదనంగా ప్రకాశించాడు. ఈ భూమిపై ఉన్న అత్యంత అద్భుతమైన వ్యక్తికి పుట్టిన రోజు శుభాకాంక్షలు(సూర్యుడు తనకి శుభాకాంక్షలు తెలుపుతున్నట్లుగా). ఈ ప్రత్యేక బర్త్‌డే విషెస్‌కు ధన్యవాదాలు. ఈ అనుభూతి చాలా అందంగా ఉంది. నా పుట్టిన రోజు సెలవు దినం అయి ఉండాలి’ అంటూ #HappyBirthday అనే హ్యాష్‌ ట్యాగ్‌తో తనకు తానుగా సోషల్‌ మీడియాలో శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఇక ఈ భామ పోస్టుకు ఆమె అభిమానులు ఫిదా అవుతున్నారు. తన పోస్టుకు ఇప్పటికి వరకు లక్షల్లో లైక్‌లు రాగా.. పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. కాగా ఊర్వశి ఇన్‌స్టాగ్రామ్‌లోనే కాక ట్విటర్‌, మైక్రో బ్లాగింగ్‌ వెబ్‌సైట్స్‌లో #UrvashiRautela టాప్‌ ట్రెండ్‌ జాబితాలో ఉన్న సంగతి తెలిసిందే. కాగా ప్రస్తుతం ఊర్వశి హిందీ రీమేక్‌లో వస్తున్న తమిళ సూపర్‌ హిట్‌ మూవీ ‘తిరుటు పాయలే 2’లో నటిస్తున్నారు.