అకీరా బర్త్‌డే.. చిరు ట్వీట్‌ వైరల్‌

మెగాఫ్యామిలీ అభిమానులకు ఈ రోజు డబుల్‌ ధమాకా. స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, లిటిల్‌ పవర్‌స్టార్‌ అకీరా నందన్‌ల పుట్టిన రోజు కావడంతో సోషల్‌ మీడియాలో విషెస్‌ల మోత మోగిపోతుంది. వీర్దిదరికి ఇప్పటికే టాలీవుడ్‌ ప్రముఖులు బర్త్‌డే విషెస్‌ తెలిపారు. కాగా, మెగాస్టార్‌ చిరంజీవి బన్ని, అకీరాలకు తనదైన శైలిలో శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. ముఖ్యంగా అకీరాకు చిరు బర్త్‌డే విషెస్‌ తెలపడం పట్ల అటు​ మెగాస్టార్‌, ఇటు పవర్‌స్టార్‌ ఫ్యాన్స్‌ మురిపిపోతున్నారు.  


‘మన బిడ్డ మనకంటే ఎత్తుకు ఎదగాలని కోరుకుంటాం. నా చేతిలో ఒదిగిపోయిన ఈ బిడ్డ, ఎత్తులో అందరికంటే ఎదిగిపోయాడు.(6'4") అన్ని విషయాల్లో కూడా అందరిని ఇలానే  మించిపోవాలి. విష్ యూ ఏ పవర్ ఫుల్ ప్యూచర్. హ్యాపీ బర్త్ డే అకీరా’అంటూ చిరంజీవి ట్వీట్‌ చేశారు. అంతేకాకుండా అకీరాను ఎత్తుకుని ఉన్న ఫోటోను షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ వైరల్‌ అవుతోంది. చిరంజీవితో పాటు మెగా కుటుంబసభ్యులు, మెగా ఫ్యాన్స్‌ కూడా అకీరాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.