హాలియా : జిల్లాలోని నాగార్జునసాగర్ నియోజకవర్గంలో మద్యం దందా జోరుగా సాగుతోంది. లాక్‌డౌన్‌ను పట్టించుకోని లిక్కర్ వాపారులు మద్యం అక్రమ రవాణాకు తెరలేపినట్లు తెలుస్తోంది. ఈ మద్యం దందా అంతా కూడా ఎక్సైజ్ అధికారుల కన్నుసన్నతోనే సాగుతోందని నియోజకవర్గ వ్యాప్తంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. 15 రోజుల క్రితం నియోజకవర్గంలో ఉన్న వైన్స్ షాపులకు ఎక్సై జ్ అధికారులు సీల్ వేశారు. అయితే ఆయా వైన్స్ షాపులకు వేసిన తాళాలు వేసినట్లుగా ఉన్నా.. లోపల సరుకంతా ఖాళీ అవుతుండడంపైనే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బయట నుంచి చూస్తే మనకు కనిపించేది ఒక్కటైతే.. దాని వెనుక జరిగే వ్యవహారం మరోలా ఉంది. పోలీసుల నిఘా, ప్రభుత్వ హెచ్చరికలను ఏమాత్రం పట్టించుకోని కొంత మంది మద్యం అక్రమార్కులు ఈ అక్రమ వ్యాపారానికి తెరతీశారు.
లాక్‌డౌన్‌లో.. లిక్కర్ దందా..!